ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణఎట్టకేలకు మేల్కొన్న తెలంగాణ రాష్ట్ర కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం!

ఎట్టకేలకు మేల్కొన్న తెలంగాణ రాష్ట్ర కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 14 2026: గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చాక కూడా గేట్లు ఎత్తి కాలువల్లోకి నీళ్లు వదలాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే కానీ రేవంత్ ప్రభుత్వం నిద్రలేవడం లేదు. 2024, 2025 లో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు. రెండు వారాలుగా ప్రాణహిత నదినుండి వరద వచ్చి గోదావరిలో కలుస్తున్నది. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి వద్ద, దేవాదుల ప్రాజెక్టులో, సీతారామ ప్రాజెక్టులో ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ డిమాండ్ చేశాక కానీ నిద్రలేవని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నటి దాకా దేవాదులలో 10 పంపులు ఉంటే 7 మాత్రమే నడిపిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం కరువు పరిస్థితులు ఉంటే కనీసం వరద నీరు కూడా లిఫ్ట్ చేయలేని దుస్థితి. పది రోజులు బీఆర్ఎస్ ఆందోళన చేస్తే నిన్న కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొని హుటాహుటిన దేవాదుల పంప్ హౌస్ సందర్శించి రేపటి నుండి 10 పంపులు నడపాలని ఆదేశించిన కాంగ్రెస్ మంత్రులు. మరి 15 రోజుల నుండి వరద వస్తుంటే అన్ని పంపులు ఆన్ చేయక గుడ్డి గుర్రాల పండ్లు తోమిండ్రా అని ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!