సోమశిల లో సంగమేశ్వర దర్శనం
పర్యాటకుల నిలిపివేత

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 26 2026: ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల మహారాష్ట్ర నుంచి నారాయణపూర్ ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండిపోవడంతో దిగువకు వదులుతున్న మీరు ప్రవాహం వల్ల జోగులాంబ గద్వాల జిల్లా సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. రెండు రోజుల్లో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాలకు ప్రస్తుతం 32 27 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుతం 316. 09 మీటర్లు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.318 టిఎంసిలు నీరు ఉన్నట్లు తెలిపారు. ఈ వరద ప్రవాహం వల్ల ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం సోమశిల సంగమేశ్వర బోటింగ్ సేవలు నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వరద జలాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పర్యాటకులు ఎవరు సంగమేశ్వర దర్శనం కోసం రావద్దని తెలిపారు. ఈ విషయం పర్యాటకులు గమనించాలని పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు.

