ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తిని చాటిన మద్దిగట్ల మోజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసిన ఆచార్య జయశంకర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు, ఉద్యోగులు అనేక కష్టనష్టాలను భరించి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేసిన త్యాగాలు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నేటి విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతికతతో పాటు అన్ని రంగాల్లో రాణించి ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణి ప్రభ, కె. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, చిన్నారెడ్డి, విద్యార్థులు, విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!