ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమాను కలిసి సమస్యలు విన్నవించిన మెడికల్...

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమాను కలిసి సమస్యలు విన్నవించిన మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఎస్ పి ఎస్ సంఘo ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 10 2026: ప్రభుత్వ హస్పటల్ నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులకు 1 తారీకు నాడే జీతాలు :::::: హర్షం వ్యక్తపరిచిన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ ( ఎస్ పి ఎస్ ) మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ సవరణ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో 18 వేల మంది కార్మికుల కుటుంబాలలో చిరునవ్వులు చిందించేలా……. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇచ్చిన స్టేట్మెంట్ మంత్రి ఆదేశాలతో ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు చొరవ తీసుకొని 18 వేల మంది కార్మికులను ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ విలీనం చేయాలి అని ఎస్పిఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి కుర్రి సైదయ్య, చిన్న బోస్క నరేష్ లు కోరినారు. శుక్రవారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో గల ఆరోగ్యశాఖ మంత్రి నివాసం నందు ఎస్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలిసి కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది. అనంతరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య మంత్రి దృష్టికి 18,000 మంది కార్మికులు అందరిని కూడా ఐఎఫ్ ఎం ఐ ఎస్ విలీనం చేసి ఫిక్స్డ్ వేతనం 26000/- అందేలా చేయాలి అని మరియు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ నందు బెడ్ సైడు కాంటాక్ట్ ఏజెన్సీలు అయిపోయి సంవత్సర కాలం గడుస్తుంది. అని వేతనాల పెంపు విషయంలో కూడా తమరు చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ప్రతి ప్రభుత్వ ఆస్పటల్ నందు మా మహిళా కార్మికులకు వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు అమలుపరిచే రీతిగా చేయాలి అని కోరినారు. ఐఎఫ్ఎమ్ఐఎస్ లో విలీనం ద్వారానే బెడ్ సైడు కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర లో వివిధ ప్రభుత్వ ఆస్పటల్ నందు బెడ్ సైడు కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రమాదాలకు గురి అయ్యి కొంతమంది మరణించి కొంతమంది అంగవైకల్యముగా ఉన్నవాళ్లు ఉన్నారు అని తెలియపరిచారు. చాలామందికి ప్రమాద బీమా అందటం లేదు అని ఆవేదన వ్యక్తపరిచినారు. మా బెడ్ సైడు కార్మికులందరికీ కూడా ఈపీఎఫ్ & ఈ ఎస్ ఐ సక్రమంగా అందరికీ అందేలా చేయాలి అని కోరినారు. ఇట్టి విషయాలు అన్ని క్షుణ్ణంగా విని తప్పనిసరి మీ అందరికీ మంచి రోజులు వస్తాయని సానుకూలంగా స్పందించినారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ కమిటీ ఉపాధ్యక్షులు వైనాల రవి ఎస్ పి ఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మరో ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి ఉభయ రమక్క ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్. నాగమణి ఎస్ పి ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎస్.కె. సైదాబీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ఎస్ పి ఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు ఏనుగుల రఘు ఎస్ పి ఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి అజయ్ మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన ఎస్ పి ఎస్ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

Previous article
Next article
లేయలాండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాటి హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్‌ను అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు గారు నిర్వాహకులు శ్రీ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్ వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించి సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అనంతరం గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు తాటి వెంకటేశ్వర్లు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి, శ్రీ సీతారామచంద్ర స్వామివారి మెమెంటోను అందజేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొని నూతన సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!