ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపగురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో తీర్థప్రసాదాల పంపిణీ

గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో తీర్థప్రసాదాల పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం. వెంకటేశ్వర్లు జులై 29 2026 బ్రహ్మంగారిమఠం, కడప జిల్లా: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాములవారు, వారి తమ్ముడు దత్తాత్రేయ స్వామివారు కలిసి తమ తండ్రి, పరమపూజ్యులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ వసంత వెంకటేశ్వర స్వాములవారి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠానికి విచ్చేసిన భక్తులు, శిష్యులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేసి ఆశీర్వచనాలు అందించారు. గురుపౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మఠానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!