పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 13 2026: పెద్దమందడి, జూలై 13: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని బూత్‌వారీ ఓటరు దరఖాస్తుల పురోగతిని గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో మాట్లాడిన ఆమె, గ్రామంలో SIR ప్రక్రియను మరింత వేగవంతం చేసి వారం రోజుల్లోగా 100 శాతం ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామంలో మొత్తం 2,035 మంది ఓటర్లలో 1,602 మంది వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో, నమోదు శాతం 78కు చేరిందని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. SIR ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత పై అధికారులకు సమాచారం అందించి పరిష్కరించుకోవాలని బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి, బూత్ లెవల్ అధికారి లక్ష్మి, బీఎల్‌ఏ కొంకలి నరసింహ తదితరులు పాల్గొన్నారు. బాక్స్: పామిరెడ్డిపల్లి SIR పురోగతి, మొత్తం ఓటర్లు: 2,035, ఆన్‌లైన్ నమోదు పూర్తైనవి: 1,602, పురోగతి: 78 శాతం
బూత్‌వారీ వివరాలు:
బూత్ 78 – 840 ఓటర్లలో 637 నమోదు, బూత్ 79 – 693 ఓటర్లలో 534 నమోదు, బూత్ 80 – 324 ఓటర్లలో 296 నమోదు, బూత్ 82 – 178 ఓటర్లలో 135 నమోదు
