ePaper
Friday, October 30, 2026
📄 ePaper

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ ( ఆర్సి కారం వెంకటేష్ అక్టోబర్ 30: ములకలపల్లి మండలం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో డిజిటల్ చైతన్యం తెచ్చేలా, రక్షణకు భరోసా కల్పిస్తూ నిర్వహించిన పోలీస్ అక్క కార్యక్రమం పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నేటి డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సైబర్ ముప్పులు, లైంగిక వేధింపుల నివారణ మరియు స్వీయ రక్షణ పద్ధతులపై పోలీసులు విద్యార్థినులకు విలువైన అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై మధు ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఎన్. సుధాకర్ రావు, పీసీ వర ప్రసాద్, డబ్ల్యూపీసీ లక్ష్మి తదితర పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థినులతో ముచ్చటించారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడకంలో విద్యార్థినులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆన్‌లైన్ మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో హెడ్ కానిస్టేబుల్ ఎన్. సుధాకర్ రావు వివరించారు. ఆపద సమయంలో లేదా ఎవరైనా వేధింపులకు పాల్పడినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో పీసీ వర ప్రసాద్, డబ్ల్యూపీసీ లక్ష్మి ప్రాథమిక స్వీయ రక్షణ మెళకువలను విద్యార్థినులకు చేసి చూపించారు.కొన్ని దృశ్యాలను చూపిస్తూఅవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. సునీత ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని, భద్రతా భావాన్ని పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన సదస్సులో ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం డయల్ 112 నంబర్లను సంప్రదించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

Latest Articles

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...

error: Content is protected !!