ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటప్రజాప్రతినిధే భక్షకుడైతే?

ప్రజాప్రతినిధే భక్షకుడైతే?

📰 Generate e-Paper Clip

పేదవాడి బతుకు అరణ్యరోదనే!

​అశ్వారావుపేటలో అరాచకం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ బ్యూరో పి సత్యనారాయణ 

తాతల నాటి అసైన్మెంట్ భూమిపై సర్పంచ్ దంపతుల కన్ను

​కోర్టు ఆర్డర్లను సైతం బేఖాతరు చేస్తూ 8 ఎకరాల కబ్జాకు దౌర్జన్యం

​బాధితుడు పెనుబోయిన శ్రీనుకు ప్రాణహాని?

న్యాయం చేయండి అంటూ కన్నీటి విన్నపం!

​అశ్వారావుపేట, పొలిటికల్ పవర్

గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండి, ప్రజల సమస్యలను తీర్చాల్సిన ప్రజాప్రతినిధే అధికార మదంతో కండకావరం ప్రదర్శిస్తే ఆ ఊరి పేద ప్రజలకు దిక్కెవరు? చట్టాన్ని గౌరవించాల్సిన వారే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దౌర్జన్యాలకు దిగితే సామాన్యుడికి రక్షణ ఎక్కడిదంటూ బాధితులు వాపోతున్న సంఘటనలు అనేకం ఇటీవల కాలంలో దర్శనమిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి అన్యాయమే అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో వెలుగుచూసింది. దశాబ్దాలుగా నమ్ముకున్న భూమిని సర్పంచ్ దంపతులు రాజకీయాధికారంతో లాక్కోవాలని చూస్తుండడంతో, ఒక పేద రైతు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

దశాబ్దాల సాగు.. ప్రభుత్వ రికార్డుల్లోనూ స్పష్టం!

​నారంవారిగూడెం పరిధిలోని సర్వే నంబర్ 108/35 లో గల మొత్తం 8 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం పేద కుటుంబాలకు అసైన్మెంట్ (పట్టా) భూమిగా కేటాయించిందని, బాధితుడు పెనుబోయిన శ్రీను కుటుంబం తమ తాత ముత్తాతల కాలం నుండి ఈ భూమినే నమ్ముకుని, చెమటోడ్చి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందని, ప్రభుత్వ రికార్డుల్లోనూ, రెవెన్యూ కాగితాల్లోనూ ఇది స్పష్టంగా అసైన్మెంట్ భూమిగానే నమోదై ఉందని, చట్టప్రకారం ఈ భూమిని అమ్మడానికి గానీ, కొనడానికి గానీ ఎవరికీ హక్కు లేదని ప్రభుత్వ చట్టాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

పొలిటికల్ పవర్‌తో సర్పంచ్ దంపతుల దౌర్జన్యం!

​పరిస్థితి ఇలా ఉండగా, నారంవారిగూడెం గ్రామ సర్పంచి మనుగొండ నాగమణి మరియు ఆమె భర్త ముక్కయ్యలు ఈ 8 ఎకరాల భూమిపై కన్నేశారని, ఈ భూమి మాది అంటూ కొత్త రాగం అందుకుని, తమకున్న రాజకీయ అండతో భూమిని ఆక్రమించుకోవడానికి కుట్ర పన్నారని. అంతటితో ఆగకుండా, భూమికి అసలైన హక్కుదారుడైన పెనుబోయిన శ్రీను అనే నన్ను కనీసం భూమిలోకి కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మీడియా ముందు వాపోయారు. ఎదిరిస్తే చంపేస్తాం అంటూ అడుగడుగునా బెదిరింపులకు దిగుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

కోర్టును సైతం ధిక్కరించి వ్యవసాయం!

​తమ భూమిని కాపాడుకునేందుకు బాధితుడు శ్రీను పోలీస్ స్టేషన్ చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు న్యాయం కోసం ఆయన కోర్టును ఆశ్రయించానని, ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో నడుస్తోందని, అయితే, సర్పంచ్ దంపతులకు చట్టం అన్నా, కోర్టులన్నా ఏమాత్రం భయం లేనట్టు ప్రవర్తిస్తున్నారని, కోర్టు ఆదేశాలను సైతం పూర్తిగా ధిక్కరించి, అదురు బెదురు లేకుండా అదే వివాదాస్పద భూమిలో దౌర్జన్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారని, పెనుబోయిన శ్రీను ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక యంత్రాంగం మరియు ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మా ప్రాణాలకు రక్షణ లేదు

​మేము తాతల కాలం నుండి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. మాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా కాగితాలు ఉన్నాయి. కానీ సర్పంచ్ తనకున్న అధికార బలంతో మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ, మా భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కోర్టులో కేసు నడుస్తున్నా వినకుండా మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మాకు సర్పంచ్ దంపతుల నుండి ప్రాణహాని ఉంది, ఉన్నతాధికారులే స్పందించి మా భూమి మాకు దక్కేలా చూడాలని బాధితుడు పెనుబోయిన శ్రీను తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు.

ఉన్నతాధికారులు స్పందించాలి

​రాజకీయ అండ చూసుకుని పేద రైతు పొట్టగొడుతున్న సర్పంచ్ నాగమణి, ముక్కయ్యల అక్రమ భూకబ్జా యత్నంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పొలిటికల్ పవర్‌తో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న సర్పంచ్ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకుని, పెనుబోయిన శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని మండల వ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!