ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ప్రత్యేక ఓటరు జాబితా సవరణను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా బేగం

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ప్రజలు బాధ్యతగా సహకరించాలని విజ్ఞప్తి

22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి శ్రీకారం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 220 పోలింగ్ బూత్ పరిధిలోని 22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండాలనే లక్ష్యంతో అధికారులు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. అలాగే, మరణించిన వ్యక్తుల పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉంటే వాటి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించి, సంబంధిత అధికారులకు అందజేసి వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. అదేవిధంగా, నివాసం మారిన వారు, అర్హత లేని ఓటర్లు లేదా ఇతర మార్పులు ఉన్నట్లయితే వాటిని కూడా తెలియజేసి ఓటరు జాబితాను తప్పులులేని విధంగా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని రిహానా కమల్ పాషా పిలుపునిచ్చారు.

Latest Articles

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!