ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రభుత్వ వడ్ల అక్రమ విక్రయాలు వెలుగులోకి

ప్రభుత్వ వడ్ల అక్రమ విక్రయాలు వెలుగులోకి

📰 Generate e-Paper Clip

రెండు రైస్ మిల్లులపై కేసు నమోదు

పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామ శివారులో ఉన్న వారాహి ఇండస్ట్రీస్ రైస్ మిల్ మరియు చాముండి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులపై వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ప్రభుత్వం అందజేసిన వడ్ల బస్తాలను రైస్ మిల్లుల యజమానులు బహిరంగ మార్కెట్లో విక్రయించి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత అధికారుల ఫిర్యాదు ఆధారంగా పెద్దమందడి ఎస్ఐ పి. జలంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!