ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిభూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలి

భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలి

📰 Generate e-Paper Clip

– విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 21.2026.జిల్లాలో భూముల రీసర్వే, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గురువారం అమరచింత, పెద్దమందడి మండలాల్లో పర్యటించిపలుప్రాంతాలనుతనిఖీచేశారు.అమరచింత మండలం చింతరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతోనిర్వహించాలనిసంబంధితఅధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి రీసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూముల సరిహద్దులు, రికార్డులు తదితర అంశాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకుసూచించారు.అనంతరం పెద్దమందడి మండలం జగత్పల్లిలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరంవిద్యార్థులతోముఖాముఖిగా మాట్లాడి విద్యాభ్యాసం, అందుతున్న వసతులు, రోజువారీనిర్వహణపైవివరాలుఅడిగితెలుసుకున్నారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పౌష్టికాహార ప్రమాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్వే ఏ డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!