అలాగే, ఫ్యామిలీ ఫ్యామిలీ అబద్ధాలు చెప్పి రాజకీయాల్లో నెట్టుకొస్తోంది ‘నారా ఫ్యామిలీ‘.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పిఎన్ 9న్యూస్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఏ స్త్రీ అయినా తన భర్తను గొప్పగా చూడాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, దానికోసం ప్రత్యర్థులపై అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం సరైనది కాదు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న భువనేశ్వరి లాంటి వారు కూడా అబద్ధాలు మాట్లాడటం ఎంతమాత్రం బాగులేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1995-2004) కరువు కాటకాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడానికి ‘ఉచిత విద్యుత్’ ఇస్తే వారు కొంతమేర కోలుకుంటారని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్. రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, దానికి బాబు అంగీకరించలేదు. తరువాత వై.ఎస్. ఆర్ ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా, రైతులు చెల్లించాల్సిన 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను కూడా పూర్తిగా మాఫీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. (అంతేకాకుండా, నాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తో మాట్లాడి దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలయ్యేలా చేసిన ఘనత కూడా వై.ఎస్. ఆర్ దే.) 100 హామీలు ఇస్తే అందులో 98 హామీలను నెరవేర్చిన ఘనత వై.ఎస్. ఫ్యామిలీది. అదే 100 హామీలు ఇస్తే కేవలం 10 నుండి 15 హామీలను మాత్రమే అమలు చేసిన చరిత్ర నారా చంద్రబాబు ఫ్యామిలీది.
బోత్ ఆర్ నాట్ సేమ్ (Both are not same)…!!!
గమనిక: 2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి లాగా “రైతు రుణమాఫీ చేస్తాను” అని చెప్పి ఉంటే గెలుస్తానని తెలిసినా… 86 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని నిజాయితీగా చెప్పి, *ఓటమిని సైతం ధైర్యంగా ఎదుర్కొన్న అసాధ్యుడు మగధీరుడు మనసున్న మహారాజు వై ఎస్ జగన్.*

