ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

*బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం*

📰 Generate e-Paper Clip

 

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 4 (పొలిటికల్ పవర్ న్యూస్)

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (04.11.2026) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది.

ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి.

బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.

ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.

ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం  జరుగుతుంది

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.....

Related Articles

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...

నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్‌సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త...

error: Content is protected !!