ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిభీమా స్టేజి–2 నుంచి సాగునీటి విడుదల...

భీమా స్టేజి–2 నుంచి సాగునీటి విడుదల…

📰 Generate e-Paper Clip

92 వేల ఎకరాలకు అందనున్న సాగు నీరు

 కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు నిజమైన భరోసా

-ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29 2026: నపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి లు బుధవారం భీమా స్టేజి–2 నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భీమా స్టేజి–2 ద్వారా సుమారు 92 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నదని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందన్నారు. రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని, అవసరమైన మేరకు నీటి సరఫరా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందన్నారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి సహాయం, రుణమాఫీ, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. నేడు భీమా స్టేజి–2 ద్వారా రైతులకు అందుతున్న సాగునీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితమే అని గుర్తు చేశారు. దూరదృష్టితో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేటికీ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించని నాయకులు నేడు సాగునీటి గురించి మాట్లాడడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు విడుదలవుతుంటే, వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రైతుల కోసం శాశ్వత ఆలోచన, అభివృద్ధి దృష్టి, కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని, బీఆర్‌ఎస్ పాలనలో ప్రచారం ఎక్కువ – పని తక్కువగా సాగిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాటలు కాదు, చేతల్లో చూపిస్తూ రైతుల కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, సాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని, ప్రతి ఎకరాకు నీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!