ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అనసూయమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. శనివారం తాటిపాముల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు గోవింద్, గ్రామ పెద్దలు కలిసి విద్యార్థులకు పలకలు, గణిత కంపాస్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కేల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రయ్య మాట్లాడుతూ… గ్రామ పెద్దల సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు గోవింద్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు శంకరయ్య, వెంకన్న, గోపాల్, బోయ శ్రీను, గంధం విష్ణు, చంద్రయ్య, టీపీఆర్‌టీయూ జిల్లా నాయకుడు బి. శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!