ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణజాహిరాబాద్రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు సంబందించిన సీజ్ చేసిన బుక్స్ యూనిఫామ్స్ ఎక్కడ పాయె..

రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు సంబందించిన సీజ్ చేసిన బుక్స్ యూనిఫామ్స్ ఎక్కడ పాయె..

📰 Generate e-Paper Clip

సీజ్ చేసిన బుక్స్ యూనిఫామ్స్ విలువ సుమారు 10 లక్షల విలువ.. 

మండల విద్యాధికారి పని తీరుపై ఆగ్రహం వ్యక్తం..

ప్రజావాణిలో ఫిర్యాదు

చేసిన పబ్బతి సంతోష్ కుమార్..

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జహీరాబాద్ జూన్ 29 2026: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్: పట్టణంలోని గత 15 రోజుల క్రితం రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు సంబందించిన బుక్స్ యూనిఫామ్స్, విద్య చట్టానికి విరుద్ధంగా అమ్ముతున్నారని నమ్మదగ సమాచారం తెలుసుకున్న ఎంఈఓ మరియు సిబ్బంది అక్కడికి చేరుకొని అధిక రేట్లకు బుక్స్ యూనిఫామ్స్ అమ్మకాలు జరుపుతుండగా యూనిఫామ్స్ బుక్స్ ను సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని,సంతోష్ వ్యక్తం చేశారు.గత వారం రోజుల క్రితం పాఠశాల యాజమాన్యం సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే సీజ్ ను తొలగించి, యదావిధిగా అమ్మకాలు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఒక ప్రభుత్వ మండల విద్యాశాఖాధికారి అధికారికంగా సీజ్ చేసిన షేట్టర్ను, ఓ గది తాళాలను పగులగొట్టి స్కూల్ యాజమాన్యం షేట్టర్ను ,ఓ గదిని తెరిచి యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికి, అధికారులు మాత్రం ఆఫీస్ కే పరిమితం అయ్యారే తప్ప, అటు చూసిన పాపాన పోలేదు. కావున సంబంధిత అధికారులు ఏ రీతిలో పనిచేస్తున్నారు అర్థమవుతుందని, మండల విద్యాశాఖాధికారి నుండి ఎటువంటి చర్యలు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కావున ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెతికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్బతి సంతోష్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!