ePaper
Monday, November 2, 2026
📄 ePaper

మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.. ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ న్యూస్ : జహీరాబాద్ మండల పరిధిలోని బూర్దిపాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంజీ. రాములు హాజరయ్యారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు, పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన
ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ
సర్పంచ్ మల్లీకార్జున్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపసర్పంచ్ తుక్కమ్మ, బీ.శోభారాణి, తుకారాం, ఆర్.రేక , జే.నర్సింహులు, కే.భవానీ, బీ.ప్రశాంత కుమార్ గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ జరగడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Latest Articles

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమరశంఖం: 2వ డివిజన్ (పాండురంగాపురం) ‘ఆధార్ పార్టీ’ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ!

పొలిటికల్ పవర్ / డిజిటల్ న్యూస్  జిల్లా ప్రతినిధిఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల :...

✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర...

Related Articles

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్...

పార్టీ కోసం పనిచేసే నాయకుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కమిటీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అక్టోబర్ 1, 2026 నుంచి...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* తాడేపల్లి, సెప్టెంబర్ 30: పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు,...
error: Content is protected !!