పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ న్యూస్ కలసపాడు అక్టోబర్ 22 2026: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం లింగారెడ్డిపల్లె గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా బత్తుల సుభాషిని బరిలోకి దిగారు. బుధవారం ఆమె కలసపాడు ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సురేష్ కుమార్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా బత్తుల సుభాషినికి మద్దతుగా లింగారెడ్డిపల్లె ఆయికట్టు ప్రెసిడెంట్ కుమారుడు నెమలయ్యగారి స్వామి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మద్దతుదారులు ఆమెకు అండగా నిలిచారు.

