–నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో రూ.1.35 కోట్ల వ్యయంతో 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17.2026.
విద్యార్థులు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో రూ.1.35 కోట్ల వ్యయంతో 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు మర్రికుంట కేజీబీవీలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గురువారం వనపర్తి జిల్లా మర్రికుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్మార్ట్ బోర్డు పై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతకాన్ని చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం రూ.1.35 కోట్ల వ్యయంతో 16 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.అనంతరం 9వ తరగతి విద్యార్థులతో ఎంపీ ముచ్చటించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ చిన్నతనంలో ఇలాంటి స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని కష్టపడిచదివిపదోతరగతిలో 100 శాతం ఉత్తీర్ణతతో పాటుఅత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ,విద్యార్థులుసాంకేతికతను విద్యాభ్యాసంలో వినియోగించుకొని విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ద్వారా బోధన మరింత ప్రభావవంతంగా మారివిద్యార్థులఅభ్యాసనైపుణ్యాలుమెరుగుపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ కుమార్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ మహబూబ్‌నగర్ క్లస్టర్ హెడ్ ప్రవీణ్ కుమార్ ఝా , జీఐబీ స్టేట్ హెడ్ పీ. జే. శ్రావణ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీహెచ్ వెంకటేష్,పాఠశాలప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



