హిందూ సంప్రదాయ చెక్కభజన మరియు కోలాటాలను పల్లె పల్లె లో వెలుగులోనికి తీసుకొని రావాలి.
లలిత కళాభిరామ పించం సొసైటీ ప్రెసిడెంట్ , మరియు హస్తకలా నిపుణులు కళా రత్న అవార్డు గ్రహీత. డాక్టర్. గొల్లపల్లి జయన్న హైదరాబాద్.కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. హిందూ శాస్త్రీయ జానపద చెక్కభజన కోలాటాలను పల్లె పల్లెల్లో ప్రదర్శించి హిందూ సంప్రదాయ పద్ధతిని వెలుగులోకి తీసుకురావాలని అలాగే గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య దృష్ట్యా అన్ని కళారంగాలలో ముందుకు వెళ్లే విధంగా ప్రజలను చైతన్యం చేయించాలని సంకల్పంతో లలిత కళాభిరామ పించం డైరెక్టర్, కళా రత్న అవార్డు గ్రహీత శ్రీ గొల్లపల్లి జయన్న వారి తల్లిదండ్రులపేరు మీద లలిత జానపద చెక్కభజన కోలాట కళాకారులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు వారి స్వగ్రామమైన చింతపుత్తాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా జానపద చెక్కభజనకు వన్నె తెచ్చి భజన కార్యక్రమములోనే నేలకొరిగిన జాతిరత్నమైన సగిలి. భజన పుల్లయ్య ఆత్మ శాంతి కోసం వారి సతీమణి అయిన అయ్య వారమ్మను ముందుగా శాలవతోను, నగదు బహుమతితో సన్మానించారు. అనంతరం ఆయన కుటుంబ తరపున వారి అల్లుడైన ముండ్లపాటి ప్రసాదరావును కూడా సాదరంగా శాలవతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చెక్కభజన లు అంతరించిపోకుండా గురువులు అందరూ కలసికట్టుగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు బంధువులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

