వాణిజ్య పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందండి
-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవం లో భాగంగా పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లెగ్రామంలో రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ – సౌర విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… పామిరెడ్డి పల్లె గ్రామ ప్రజలు రాజకీయంగా చైతన్యం గలవారని అన్నారు. పెద్దమందడి మండలంలోని గ్రామాలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావడంతో వరి పంటలు ఎక్కువ పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు వరి పంటనే అధికంగా పండిస్తున్నారు కాబట్టి భూమి సారాన్నీ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి పంట మార్పిడి చాలా ముఖ్యమని తెలిపారు. ఉత్తర భారత దేశంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంల భారతదేశంలోని లో ఒకప్పుడు గోధుమ పంటను ఎక్కువగా సాగు చేసేవారు కానీ అక్కడ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కట్టడంతో అక్కడి ప్రాంత రైతులు వరి పంటను సాగు చేస్తూ రెండో పంటగా గోధుమలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారని తెలిపారు. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించుకొని నేలతల్లి ఆరోగ్యం కాపాడడం గురించి అవసరం మేరకే రసాయనాలు వినియోగించడం పై, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు అని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పప్పు దినుసులు, ఆకుకూరలు పండించి అధిక లాభాలను పొందాలని రైతులకు సూచించారు. రైతు పొలంలో పనిచేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో యాంత్రీకరణ పై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు కావలసిన యాంత్రీకరణ పై ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తూ వారికి అండగా నిలబడుతుందని తెలిపారు. విద్యుత్ కొరత అనే బాధలు పారదోలడానికి రైతులు సౌర శక్తి ని వినియోగించుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పామిరెడ్డి పల్లె సర్పంచ్ మంజుల, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు, పెద్దమందడి వ్యవసాయ శాఖ అధికారి సైదులు యాదవ్, ఎంపీడీవో పరిణతి, ఎమ్మార్వో పాండు నాయక్, వివిధ గ్రామల ఏఈఓలు,వివిధ గ్రామల సర్పంచ్లు, గ్రామ ప్రజలు, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
