ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: పెబ్బేరు మండలం తోమాల పల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన భక్తాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రెడ్డి, శివసేన రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో నాభి శిల ప్రతిష్ట బొడ్రాయి పండుగ కూడా నిర్వహించడంతో గ్రామం పూర్తిగా పండగ వాతావరణంతో కళకళలాడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
