ప్రజాపాలనలో పంట కొనే దిక్కులేదు
– రైతులు పంట పండించడానికి పడ్డ కష్టం
కంటే అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది,
– వడ్లు కొనే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతు అండగా ఉంటుంది,
– బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026:
ప్రజాపాలనలో పంట కొనే దిక్కులేదని, రైతులు పంట పండించడానికి పడ్డ కష్టంకంటే అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని, వడ్లు కొనే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతు రైతులకు అండగా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండల కేంద్రం లో శివాజీ చౌరస్తా వద్ద వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా కొత్తకోట బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ… రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న పట్టించుకునే వారు లేరని, ప్రజా పాలనలో పంట పండిస్తే కొనే దిక్కులేదని మండిపడ్డారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, సందర్భం వచ్చినపుడు తగినబుద్ధి చెప్తారన్నారు. గన్ని బ్యాగులు, లారీలు, మిల్లుల కేటాయింపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మరోవైపు కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జాప్యం తో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు నష్టానికి అమ్ముకుంటున్నారని అన్నారు.బోనస్ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని లేకపోతే బీఆర్ఎస్ ఎక్కడిక్కడ ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. పండించిన ప్రతి గింజను కొనే వరకు రైతుల పక్షాన ఉండి పోరాడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వనపర్తి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ జీ. వామన్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పి. విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు ఎరుకలి తిరుపతయ్య, అయ్యన్న, మాజీ సర్పంచ్ ఎద్దుల నాగేష్, అడ్వకేట్ యాదగిరి, గాడీల ప్రశాంత్, సత్యమ్ యాదవ్, సాదిక్ అలీ, అస్కని శ్రీను, యుగంధర్ రెడ్డి,పసుపుల నెహ్రు, గోపాల్ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
