తెలంగాణ ఉద్యమకారుల వేదిక

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
(* టి యు వి రిజిస్ట్రేషన్ నెంబర్74/2026*)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో టి యు వి రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం జరిగినది*
తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం గోదావరిఖని నియోజకవర్గ ఇంచార్జ్ నూతి తిరుపతి ఆధ్వర్యంలో జరిగినది
తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశమునకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉద్యమకారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వేసిన కమిటీలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులు తెలంగాణ ఉద్యమకారులు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఉద్యమకారుడు కోదండరాం సార్ ని కలిసి అన్ని విషయాలను చర్చించడం జరిగింది. వారితో మా మా రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ నేను కూలంకషంగా చర్చించడం జరిగింది. వారు త్వరలోనే రాష్ట్ర పర్యటనలు చేస్తామని, నిజమైన ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం జరిగింది. జైలు కేసులైన ఎఫ్ఐఆర్ కేసులైన, జైలు శిక్ష అనుభవించిన వారితోపాటు, ఎఫ్ఐఆర్ కేసులైన వారిని మరియు 1969 ఉద్యమకారులను మరియు 2001 నుంచి 2014 వరకు నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న ఫొటోస్ మరియు పేపర్ కటింగ్స్ ఉంటాయో వారిని కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పడం జరిగింది* ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు సులోచన రావు రాష్ట్ర కన్వీనర్ కళావతి రాష్ట్ర కో కన్వీనర్ తోడేటి స్వరూప కోడిపుంజుల జ్యోతి చిలక శంకర్ అల్లి శంకర్ వీరాలాల్ ఉల్లాల మల్లేశం పులి రాకేష్ అనిత చౌదరి సంపంగి కనుకలక్ష్మి పైడిపల్లి రమేష్ విజయ్ గౌడ్ ప్రసాద్ గౌడ్ శంకర్ రాధా ఉద్యమ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
