ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికృష్ణలంక సీఐ మీద హత్యా యత్నం కేసు నమోదు హత్యా యత్నం కేసు నమోదుతో సస్పెన్షన్.

కృష్ణలంక సీఐ మీద హత్యా యత్నం కేసు నమోదు హత్యా యత్నం కేసు నమోదుతో సస్పెన్షన్.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ విజయవాడ: విజయవాడ నగరంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ గా పనిచేస్తున్న నాగరాజు, గాదె సాయి కృష్ణ విషయంలో అనుచితంగా ప్రవర్తించి, అతని లాకప్ మృతికి కారణమైనందుకు బి యన్ యస్ సెక్షన్103(1) 127(4),127)6) సెక్షన్ కింద హత్యా యత్నం కేసు నమోదు చేసి,సస్పెండ్ చేయటం జరిగింది. విజయవాడ పట్టణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే గాదే సాయి కృష్ణ ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి అతని పట్ల అనుచితoగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించటం వల్ల అతను చనిపోవటం జరిగింది. అదే పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పెరిపోగు క్రాంతి కుమార్ అనే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా సదరు సీఐ చిత్రహింసలకు గురి చేయటం వల్ల అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనీ అక్కడ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు. అనతి కాలంలోనే ఈ రెండు సంఘటనలను చూసిన ప్రజలు కష్టలంక పోలీస్ స్టేషన్ అంటే ప్రజలను రక్షించే స్టేషన్ కాదని, ప్రజలను చoపే స్టేషన్ నని అంటున్నారు. ప్రజలను రక్షించే పోలీసులే ప్రజలను స్టేషన్ లో హింసించి చంపడo క్షమించరాని నేరమని అక్కడ ప్రజానీకం అంటున్నారు. వరుసగా జరిగిన ఈ రెండు ఘటనలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లో చర్చనీయాంశంగ మారాయి. ఈ రెండు ఘటనలతో అటు రాష్ట్ర ప్రభుత్వo ఇటు పోలీసుల పరువు మంట కలిసిపోయాయని, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం,ఆటు ప్రతిపక్షం రంగంలోకి దిగటం వల్ల ఎట్టికేలకు సి ఐ నాగరాజు మీద అత్యాయత్నం కేసు నమోదు చేశారు. తమిళ నాడు రాష్ట్రంలో కరోనా సమయం లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కి కారణమైన పోలీస్ లకు మరణ శిక్ష పడిన విధంగా, విజయవాడలో 1999లో పేద దళిత మహిళ కోన కృష్ణకుమారి లాకప్ డెత్ కు కారణమైన పోలీసు లకు జీవిత ఖైది విదించినట్లే చట్టాన్ని కాపాడే పోలీసుల గౌరవాన్ని మంట కలిపిన కృష్ణ లంక సిఐ నాగరాజుకు కూడా మరణశిక్ష విధించాలని ముక్తకంఠంతో ప్రజలు కోరుతున్నారు.కృష్ణలంక సీఐ నాగరాజు కు పడే మరణ శిక్షతో గాదే సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!