ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

వేంసూరు పోలీసులకు పట్టుబడిన మరో ముగ్గురు డెకాయిట్ నిందితులు

📰 Generate e-Paper Clip

మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడింపు.

నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం.

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 05 2026: ఖమ్మం జిల్లా వేంసూరులో పోలీసులు మరో ముగ్గురు డెకాయిట్ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో డెకాయిట్ ముఠాకు చెందిన మొత్తం అరెస్టుల సంఖ్య 15కు చేరింది. ఈ మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ఐపీఎస్) ప్రెస్ నోట్ విడుదల చేశారు. జూలై 2న దారిదోపిడీకి పాల్పడి లక్షల రూపాయలు కాజేసిన డెకాయిట్ ముఠాకు చెందిన 12 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ముఠా జూన్ 24న వేంసూరులో జరిగిన దోపిడీ ఘటనలో కూడా పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు దర్యాప్తు కొనసాగింపులో భాగంగా నిన్న మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,50,000 నగదు, సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!