ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

సింగరేణిలో చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలి: ఐఎన్‌టీయూసీ

📰 Generate e-Paper Clip

జి ఎమ్ కు వినతిపత్రం అందజేసిన ; తీగల క్రాంతి కుమార్

సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు చేపట్టాలని ఐఎన్‌టీయూసీ డిమాండ్

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టి వి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏరియా ఉద్యోగులకు చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టారం ఓసీపీ, జేవీఆర్ సీహెచ్‌పీ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సింగరేణి సంస్థ 2021 సంవత్సరంలో కౌన్సిలింగ్ నిర్వహించి పీవీఎన్ సెంటినరీ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ క్వార్టర్లను కేటాయించినందుకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సత్తుపల్లిలో ఉద్యోగులకు ఇప్పటివరకు చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సత్తుపల్లి సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీనియారిటీ ప్రాతిపదికన చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్‌టీయూసీ తరఫున కోరారు. ఈ విషయంపై సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి, చేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!