ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

గ్రామ పాలనా అధికారి నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

📰 Generate e-Paper Clip

-నెల రోజులైనా కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తులకు పరిష్కారం లేదు

పొలిటికల్ పవర్ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బాద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో గ్రామ పాలనా అధికారి బి. పూర్ణ చందరావు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెల రోజులు దాటినా సంబంధిత దరఖాస్తులను పరిశీలించి ముందుకు పంపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, సమస్యపై వివరణ కోరేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, దరఖాస్తుల పురోగతిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు సమర్పించిన అప్లికేషన్లు కనిపించడం లేదని, వాటి స్థితిగతులు తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. దీంతో కుల ధ్రువీకరణ పత్రాలు ఆలస్యం కావడంతో విద్య, ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో లేని గ్రామ పాలనా అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

 – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!