ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలు దౌర్జన్యాలు జరిగితే సాధ్యమైనంత త్వరగా  ఎఫ్. ఐ.ఆర్  చేసి...

ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలు దౌర్జన్యాలు జరిగితే సాధ్యమైనంత త్వరగా  ఎఫ్. ఐ.ఆర్  చేసి చార్జి షీట్ వేయాలి

📰 Generate e-Paper Clip

– గత ఆరు సంవత్సరాల నుండి ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు నేరారోపణ జరగకపోవడం విచారకరం,
– ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే పోలీసులు, రెవెన్యూ శాఖ  అండగా ఉంటారు అనే భరోసా కల్పించాలని
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17.2026.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సాధ్యమైనంత త్వరగా కేసు నమోదు చేసి దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అధికారులను ఆదేశించారు. గురువారం  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  జరిగిన  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్మాణాత్మక చర్చలు జరిపారు.ఈ సమావేశంలో 2018 నుంచి నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, ప్రస్తుతంకేసుఏస్థాయిలోఉన్నాయి, బాధితులకు అందిన పరిహారం పై ఒక్కో కేసు వారిగా సమీక్ష నిర్వహించారు. 2025 నుండి 2026 వరకు విచారణలో ఉన్న 12 కేసులపై కేసు వారిగా చర్చించారు. జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి కేసు వారిగా వాటి పురోగతి స్థితిగతులను కమిటి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగాపార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ  2020 నుండి 2026 వరకు ఒక్క కేసు నేరారోపణ జరగలేదని ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడాలని బాధితులకు న్యాయం జరగాలన్నారు.  ఒకవేళ తప్పుడు కేసులు నమోదు చేస్తే విజిలెన్స్ కమిటీ సభ్యులు నచ్చచెప్పి కేసు ఉపసంహరించుకునే విధంగా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు పెట్టడం, తప్పు చేసినప్పటికీ శిక్ష పడకుండా బయట దర్జాగా తిరుగుతుండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.  అట్రాసిటీ కేసు నమోదు అయిన వాటిని సమగ్రంగా విచారించి తగిన ఆధారాలతో ఛార్జీ షీట్ దాఖలు చేసి తప్పు చేసిన వారికి శిక్షలుపడేవిధంగాచూడాలనిపోలీసు,రెవెన్యూఅధికారులను ఆదేశించారు.  2020 లో నమోదు అయిన ఒక కేసు 2026లో ట్రయల్ కొరకు రావడం ఇంకా తేది ఖరారు కాకపోవడం పై విస్మయం వ్యక్తంచేశారు.వెంటనేసంబంధితఅధికారులతో ఫోన్ లో మాట్లాడారు.  విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికిఅడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్,హాజరుకాకపోవడంచర్చనీయాంశం అయ్యింది.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీల భూములు కబ్జా వంటి కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేకూర్చి అండగా నిలవాలని పోలీస్, రెవెన్యూఅధికారులనుఆదేశించారు.ప్రతినెల పౌర హక్కుల దినోత్సవం పకడ్బందీగా నిర్వహించి ఎస్సీ ఎస్టీలకు చట్టంపై అవగాహన కల్పించి భరోసా ఇవ్వాలని అధికారులకు కమిటీ సభ్యులకు సూచించారు. సంక్షేమ శాఖల అధికారులతో ఆయా సంక్షేమ శాఖల ద్వారా మంజూరు అయిన సంక్షేమ పథకాల పై శాఖల వారిగా ఆరా తీశారు.  ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు.  ప్రభుత్వం ద్వారా మెస్ ఛార్జీలు కాస్మోటిక్ చార్జీలు వంటివి పెంచి విద్యార్థులకు అండగా  నిలిచేందుకు కృషి చేస్తుంటే వసతి గృహాల్లో  వార్డెన్లు సరిగ్గా ఉండటంలేదని,దానిపర్యావసానంగా విద్యార్థులు నష్టపోతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా తాను సైకిళ్లు, ఇతర సహకారం అందించడం వల్ల గత సంవత్సరం కంటే ఈసారి విద్యార్థుల నమోదు.శాతం గణనీయంగా పెరిగిందని, వారికిఅదనంగావసతిగృహాలుమంజూరుఅయ్యేవిధంగా చూడాలని పార్లమెంట్ సభ్యులను కోరారు.సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో తప్పు చేసిన వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలనీ అందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.  పౌరహక్కులదినోత్సవంప్రతినెలసజావుగానిర్వహించడం జరుగుతోందని దీనిని మరింత పకడ్బందీగా నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. అట్రాసిటీ కేసులోబాధితులకు పరిహారం అందించే విషయంలోదాదాపు75.లక్షలరూపాయలుపరిహారంఅందించాల్సిఉన్నానిధులుమంజూరుకాకపోవడం వల్ల పెండింగ్ లోఉన్నాయని, నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సభ్యులను కోరారు. ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యుడు మాదారి భోజరాజు కొన్ని సమస్యలను కమిటి దృష్టికీ తీసుకువచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్,  జడ్పీ సీఈవో యాదయ్య, షెడ్యూల కులాల సంక్షేమ అధికారి రాంజీ రావు, ఈ డి ఎస్సి కార్పొరేషన్ సిరాజుద్దీన్ ,ఆర్డిఓసుబ్రహ్మణ్యం పిడి డి ఆర్ డి ఓ ఉమాదేవి, కమిటీ సభ్యులు  డి.పి ఆర్.ఓ సీతారాం,  డి డబ్ల్యు ఓ సుధారాణి, సి. విశ్వం బాబు,  శంకర్ నాయక్, నాగన్న, రామచంద్రయ్య, యడవల్లి వీరప్ప, మాదారి భోజరాజు, స్వచ్ఛంద సంస్థల నుండి చిన్నమ్మ థామస్, వెంకట గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!