పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో : బాజా శేఖర్ వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం ఆకస్మికంగా కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయనకు తీవ్ర అస్వస్థత కలగడంతో చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచిత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన మరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని రాజకీయ, సామాజిక వర్గాల వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
