– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01. 2026.
మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన కింద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మదనాపూర్ మండలం కొన్నూరు తాండా నివాసి గోవిందమ్మకు సబ్సిడీ ద్వారా మంజూరు చేసిన మారుతి ఈకొ వాహనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిబ్బన్ కత్తిరించి లబ్ధిదారునికి తాళం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను ఆర్థిక సాధికారత సాధించేందుకుఎన్నోపథకాలుఅమలుచేస్తున్నాయని, మహిళలు వాటినిపొందిసద్వినియోగంచేసుకోవాలని సూచించారు.ఆజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన కింద బస్సు సౌకర్యం లేని గ్రామాలకు రవాణా సౌకర్యార్థంసబ్సిడీరుణాలద్వారావాహనాలుమంజూరుచేస్తుందన్నారు. వాహన ఖరీదు రూ. 6.80 లక్షలు కాగా కేవలం ఒక శాతం వడ్డీ తో రూ 6.30 లక్షలు రుణసాధుపాయంకల్పించివాహనాన్నికొనుక్కునేవిధంగాప్రోత్సహించిందన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమా దేవి, లబ్ధిదారు గోవిందమ్మ, ఇతర సిబ్బంది వాహనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

