ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెద్దమందడి మండలంలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు

పెద్దమందడి మండలంలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు

📰 Generate e-Paper Clip

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మండలంలో శుక్రవారం ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎ. ఆంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి సైదులుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు, నిల్వలు, రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫర్టిలైజర్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని ఆంజనేయులు సూచించారు. రైతులకు నిబంధనల ప్రకారం ఎరువులు విక్రయించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించవద్దని తెలిపారు.

ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (FCO) నిబంధనలను అతిక్రమించే వ్యాపారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులకు ఎరువుల వినియోగంపై సరైన సూచనలు, సలహాలు అందించాలని వ్యాపారులకు సూచించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు, ఎరువుల వినియోగంపై రైతులకు అవసరమైన వ్యవసాయ సాంకేతిక సూచనలు అందించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఆంజనేయులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!