ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

బిక్కవోలులో 20 కాసుల బంగారం చోరీ

📰 Generate e-Paper Clip

బిక్కవోలు: మండల కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గున్నం భవనమ్మ ఇంట్లో సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై బిక్కవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను బ్యాంకులో భద్రపరిచేందుకు తీసే సమయంలో అవి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు, తలుపులు, లాక్‌లు ధ్వంసమైన గుర్తులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కుటుంబ కార్యక్రమాల నేపథ్యంలో ఇటీవల పలువురు బంధువులు ఇంటికి వచ్చి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో ఇంటికి వచ్చి వెళ్లిన వారి వివరాలను సేకరించడంతో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఫిర్యాదు మేరకు డీఎస్పీ విద్యా, సీఐ సుమంత్, బిక్కవోలు ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కొంతమంది అనుమానితుల వివరాలను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Latest Articles

కదిరిలో బి.ఎస్. మక్బూల్ మార్క్… 14వ వార్డులో ఓటు హక్కు వినియోగం!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్...

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

Related Articles

రేవంత్ రెడ్డి ‘రివెంజ్’ పాలిటిక్స్? ఓటుకు నోటు ఫిర్యాదుదారుడిపై వేటు!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*  హైదరాబాద్తె  :లంగాణ రాజకీయం మరోసారి హీటెక్కింది. సంచలనం...

సెగ మొదలైందా..? అధికారులు జాగ్రత్త పడుతున్నారా? చిత్తూరు ఏకగ్రీవాలపై కలెక్టర్ సీరియస్.  24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆర్వోలకు నోటీసులు జారీm  ఉపసంహరణల వెనుక కారణాలపై ప్రశ్నల వర్షం....

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*చిత్తూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల్లో ఏకంగా...

బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడి డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి బలి! – పౌర సరఫరాల శాఖ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యతో బయటపడ్డ దందా!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*భద్రాచలం /పాల్వంచ:సమాజంలో జరుగుతున్న  అవినీతిని   ఎండగట్టాల్సిన కలం......
error: Content is protected !!