పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026.కొత్వాల్,రాజబహుదూర్,వెంకటరామారెడ్డి జయంతి వేడుకలను కొత్తకోట రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో వేముల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం కొత్తకోట చౌరస్తాలో రెడ్డి బంధువులతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.హైదరాబాదు నగర తొలి కొత్వాల్, విద్యాదాత ప్రాముఖ సామాజిక సేవకులు శ్రీ రాజా బహుదూర్ వెంకట్రాం రెడ్డి 158 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
నిజాం కాలపు కొత్వాల్ రాజ బహుదూర్ వెంకట్రాంరెడ్డి జీవిత విశేషాల గురించి సేవల గురించి కొత్వాల్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది అని వ్యక్తులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల రైతు కుటుంబాల నుంచి ఉన్నంత విద్య కోసం నగరాలకు వచ్చే పేద విద్యార్థులకు వసతి కల్పించడం ఎంతటి పెద్ద సమస్యను రాజబాబు వెంకట్రాం రెడ్డి గారు ఆనాడే గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే గొప్ప సంకల్పంతో రెడ్డి హాస్టల్ లో నిర్మాణానికి ఆయన ఆనాడే శ్రీకారం చుట్టారు అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్వాల్ రాజా ఋబహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, మొద్దు హనుమంతు రెడ్డి, దాబా శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, పి కృష్ణారెడ్డి, భరత్ భూషణ్, చంద్రశేఖర్ రెడ్డి, పెంటన్న యాదవ్,పి. మోహన్ రెడ్డి, బాబు రెడ్డి, గంగు బాల్ రెడ్డి, ఎం. బాలకృష్ణారెడ్డి,పి.నవీన్ రెడ్డి,పి.రాఘవేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గంగు మాధవరెడ్డి, మెగారెడ్డి, గాయత్రి శేఖర్ రెడ్డి, అమృత రెడ్డి, భానురెడ్డి, పాలెం రామచంద్రారెడ్డి, కొత్తూరు వెంకట్రాంరెడ్డి, నాగిరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రంగారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


