ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు

పొలిటికల్ పవర్,దమ్మపేట సెప్టెంబర్ 12: పామాయిల్‌ గెలల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పామాయిల్‌ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, పామాయిల్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్‌ ఏజెంట్లు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై రాజేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాలకు చెందిన పామాయిల్‌ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులు, పాకలగూడెం పామాయిల్‌ గెలల కలెక్షన్‌ ఏజెంట్‌ హాజరయ్యారు. రైతుల పంటకు భద్రత కల్పించడంతో పాటు గెలల దొంగతనాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు.

F-Code దుర్వినియోగంపై అప్రమత్తత

ప్రతి రైతు F-Codeకు తగిన పరిమితి విధించి, దాని దుర్వినియోగానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ F-Code వివరాలను ఇతరులకు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

పామాయిల్‌ గెలల రవాణా జరిగే ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రైతులు తమ తోటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.

అనుమానాస్పద రవాణాపై వెంటనే పోలీసులకు సమాచారం

పామాయిల్‌ గెలలను ఫ్యాక్టరీలకు తరలించేందుకు నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా పామాయిల్‌ గెలల లోడింగ్‌ లేదా అన్‌లోడింగ్‌ జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

పామాయిల్‌ గెలల దొంగతనాలను అరికట్టేందుకు రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్‌ ఏజెంట్లు, డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై రాజేష్‌ కుమార్‌ సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఈ సమావేశంలో TG Oilfed తరఫున నాగబాబు, వెంకటేష్‌, శంకర్‌, కార్తీక్‌తో పాటు పాకలగూడెం పామాయిల్‌ గెలల కలెక్షన్‌ ఏజెంట్‌ పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

కాంగ్రెస్ లోకి వలసల జోరు

పాలేరు నియోజకవర్గం  ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో...

Related Articles

మైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన

మద్దిశెట్టి శామ్యూల్‌కు అండగా నిలిచిన మహిళా కార్యకర్తలు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పొలిటికల్ పవర్, మైలవరం, సెప్టెంబర్ 10:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్సీపీ–ఎన్డీఏ మహాకూటమి మహిళా విభాగం...

తిరుమలకుంట ముద్దుబిడ్డ కు ఉస్మానియా వేదికపై డాక్టరేట్ కిరీటం

కష్టపడి చదివి.. పిహెచ్‌డి సాధించి: తిరుమలకుంట గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన డాక్టర్ కొనకళ్ల వరలక్ష్మిచిన్నతనం నుంచే చదువుపై మక్కువ.. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఉన్నత స్థాయికి!తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం, వరుస ప్రభుత్వ...

చుక్కనీటి కోసం విద్యార్థుల పోరాటం.. దమ్మపేట ట్రైబల్ హాస్టల్ లో నీటి కష్టాలు

ట్రైబల్ హాస్టల్ లో మూడు రోజులుగా నీళ్లు బంద్గిరిజన హాస్టల్ లో తాగునీటి కష్టాలు - స్పందించిన అధికారులుపొలిటికల్ పవర్, సెప్టెంబర్ 09:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని గిరిజన వసతి గృహంలో...
error: Content is protected !!