ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

ఐక్యతను చాటే పండుగ వినాయక చవితి

📰 Generate e-Paper Clip

అన్నదానం చేయడం అభినందనీయం: పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: నపర్తి పట్టణంలోని మణికంఠ కాలనీలో వినాయక చవితి సందర్భంగా కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… వినాయక పండుగ భారతీయులను ఐక్యం చేసిన పండుగ అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాల గంగాధర్ తిలక్ వినాయక మండపాలను ప్రజా వేదికలుగా మలిచి, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించారని గుర్తు చేశారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒకే చోట చేరి ప్రసాదాన్ని స్వీకరించడం మన సామాజిక ఐక్యతకు ప్రతీక అని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. “అన్నదాత సుఖీభవ” అని, అన్నదానం చేసే వారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశీ రాములు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మద్దిలేటి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శివకుమార్, జగదీశ్వర్ రెడ్డి, గోపాల్, కేశవులు, బీసీ రెడ్డి, నాగరాజ్, మైత్రి, శైలజ, నరేష్, రమేష్, రాజేంద్ర ప్రసాద్ చారి, స్వప్న, హేమలత, పుష్పలత, కళ్యాణి తదితరులతో పాటు స్థానిక భక్తులు, కాలనీ వాసులు, సాహితీ కళా వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!