ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

నాయకపోడు పూర్వీకుల చరిత్రకు ప్రతీకగా పాండవుల గృహాలు

📰 Generate e-Paper Clip

నల్లమూడిలో ప్రాచీన స్థలాలను సందర్శించిన నాయకపోడు కుల పెద్దలు..

చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణకు పిలుపు

పొలిటికల్ పవర్, ములకలపల్లి,అక్టోబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లమూడి గ్రామ సమీపంలో ఉన్న పాండవుల గృహాలను నాయకపోడు సేవా సంఘం కుల పెద్దలు, స్థానిక గ్రామస్తుల ఆధ్వర్యంలో సందర్శించారు. నాయకపోడు కులస్థుల చారిత్రక మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉన్నాయని భావిస్తున్న ఈ ప్రాచీన ప్రదేశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాయకపోడు సేవా సంఘం నాయకులకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తంబళ్ల రవి మాట్లాడుతూ.. నాయకపోడు కులస్థులకు పాండవుల కాలం నాటి చరిత్రతో విశిష్టమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. తమ పూర్వీకుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు.

నల్లమూడి గ్రామ సమీపంలోని పాండవుల గృహాలు కేవలం ప్రాచీన ప్రదేశాలు మాత్రమే కాకుండా, తమ కుల చరిత్రను, పూర్వీకుల సంప్రదాయాలను గుర్తుచేసే ప్రదేశాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను పరిరక్షించి, భావితరాలకు వాటి ప్రాధాన్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

రానున్న రోజుల్లో నాయకపోడు కులస్థుల ఆధ్వర్యంలో ఈ ప్రదేశంలో నిత్య పూజలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు తంబళ్ల రవి తెలిపారు. ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, ప్రాచీన ఆనవాళ్ల పరిరక్షణకు కులస్థులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27...
error: Content is protected !!