ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

మట్టిలో మాణిక్యాలు శేరుపల్లి విద్యార్థులు – పలుస శంకర్ గౌడ్ ప్రశంసలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 24 2026: శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలో చదువుకున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ప్రశంసించారు. శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 5 గురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పల్లెటూళ్ళలో పుట్టి క్రమశిక్షణతో చదువుకొని గొప్పగా ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారని అలాంటి వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుండే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకొని అందులో చక్కగా రాణించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫెన్సింగ్ (కత్తి యుద్ధ)పోటీలో ద్వితీయ స్థానం సాధించిన సురేఖ, భువనేశ్వర్ లలోని సైనిక్ స్కూల్ లో సీటు సాధించిన భార్గవ్, రూపా సీఈఓ కాలేజీలో సీటు సాధించిన రూప, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఫైనల్ లో బెస్ట్ మార్కులు సాధించిన వర్ష లను కళావేదిక పక్షాన శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల అంకితభావం ఉందని కొనియాడుతూ ఉపాధ్యాయులు నరసింహ, రమేష్, ఈశ్వర్ రెడ్డి, ప్రసన్న లను కూడా సన్మానించారు. ఈనాటి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య,ఉప సర్పంచ్ బిచ్చన్న,ఎం.ఈ.ఓ హనుమంతు,కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్, రంగస్థల కళాకారుల జిల్లా అధ్యక్షుడు ఎల్.ఉమా మహేశ్వర్,మొయినుద్దీన్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

కొత్తకోటలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం మూడు డబ్బాలు దగ్ధం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 30.2026.వనపర్తి జిల్లాలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని మదనాపురం రోడ్డులోగలమటన్.మార్కెట్,సమీపంలోబుధవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై టీఆర్‌పీ గురి!

బీసీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు చరమగీతం పాడాలి విద్యావంతులు, నిరుద్యోగులు, బహుజనులు ఏకమైతేనే సామాజిక న్యాయం సాధ్యం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై జిల్లా టీఆర్‌పీ పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలి 

– భూముల రీసర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు, భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశం, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్...
error: Content is protected !!