ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన రామారావు పేట సర్పంచ్ పులి రాజశేఖర్

అక్టోబర్ 28: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

రక్తదానం ప్రణధానం తో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి :సి పి అంబర్ కిషోర్ ఝా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌ జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు రక్తదానం చేసిన ఎస్ఐ భూమేష్ , పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించిన రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, అవసరమైన సందర్భాల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా అర్హులైన వారు క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు, జైపూర్ సిఐ నవీన్ కుమార్ ఎస్సై భూమేష్ ప్రజా ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు.

Latest Articles

అకాల వర్షంతో పత్తి రైతులకు అపార నష్టం..పత్తి తీయకముందే వర్షం

పంట చేతికొచ్చే సమయంలో ఆర్నబ్ తుఫాన్ రైతులకు తీరని నష్టం..జూలూరుపాడు అక్టోబర్28:...

జూలూరుపాడులో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు

జూలూరుపాడు లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మణిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో నూతన ఆర్వో ప్లాంట్ ప్రారంభం

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ కృషితో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం...

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

error: Content is protected !!