ePaper
Monday, November 2, 2026
📄 ePaper

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

📰 Generate e-Paper Clip

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక

ఆదివాసీల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపడతాం: నాయకులు

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు

పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 1:ఆదివాసీలు తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే మార్గమని, హక్కుల సాధన కోసం దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆదివాసి సేన నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం దమ్మపేట మండలం పట్వారిగూడెంలో నిర్వహించిన ఆదివాసి సేన మండల సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా న్యాయవాది ఊకె రవి, పార్కలగండి గ్రామపంచాయతీ సర్పంచ్ కొమరం సుశీల హాజరై మాట్లాడారు. ఎన్నికల పరిశీలన, పర్యవేక్షణ అధికారులుగా జిల్లా కమిటీ సభ్యులు శెట్టిపల్లి శ్రీను, వగ్గేల వెంకటేశ్వరరావు, సోడే శ్రీను, సోదెం సుమన్ బాబు వ్యవహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆదివాసి సేనతో పాటు విద్యార్థి సేన, రైతు సేన, కార్మిక సేన, మహిళా సేన విభాగాలకు నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సేన ఎల్లప్పుడూ ఆదివాసీల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం ప్రత్యక్ష ఉద్యమాలు చేపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూమి, హక్కులు, రక్షణ, సామాజిక న్యాయం తదితర సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివాసీ ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

దమ్మపేట మండల పరిధిలో ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ అమాయక ఆదివాసీలపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. పేద ఆదివాసీల భూముల విషయంలో వారికి న్యాయం చేయకుండా, పలువురు అధికారులు బడాబాబులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు.

అధికారులందరూ ఏజెన్సీ చట్టాలకు లోబడి విధులు నిర్వహించాలని, ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమాయక ఆదివాసీలను రాజకీయ నాయకుల మాటలతో ప్రభావితం చేసి ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని, బాధ్యులపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

నూతన కమిటీ ఎన్నిక:

ఆదివాసి సేన దమ్మపేట మండల అధ్యక్షుడిగా తోలేం శ్రీను, ప్రధాన కార్యదర్శిగా కీసర వెంకటస్వామి, కార్యదర్శిగా కీసరి రవిని ఎన్నుకున్నారు.

ఆదివాసి విద్యార్థి సేన మండల అధ్యక్షుడిగా వెల్కమ్ అంజి, ప్రధాన కార్యదర్శిగా సోయం నివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సోడే సందీప్, కొరస వీరస్వామి, కోరం జయంత్, కొరసా సుధాకర్, గడ్డం పవన్, వాడే కిరణ్‌లను ఎంపిక చేశారు.

ఆదివాసి మహిళా సేన విభాగంలో గడ్డం వెంకటరమణ, కలం వెంకటలక్ష్మిని కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా దారబోయిన పోతురాజు, సలహాదారులుగా చిలకా శ్రీను, కారం పోతురాజును ఎంపిక చేశారు.

అలాగే ఆదివాసి సేన వివిధ విభాగాల కమిటీ సభ్యులుగా సవలం నరసింహారావు, కుంజ మధు, కాక నాగరాజు, ఊకె శ్రీను, ఊకె వెంకటేష్, కొరసా వెంకటేష్, ఊకె నరసింహారావు, నారం వెంకటేశ్వరరావు, కారం బోడయ్య, కురం ప్రసాద్, ఊకె పెంటయ్య, రావుల జనార్ధన్, కోలా రాజు, రావుల రవి, చిలకా రాము, కొరస మహేష్, కొయ్యల రాజు, రావుల కృష్ణ, కాశిని చిన్నబాబు, మచ్చల నాగరాజు, మచ్చల సుధాకర్, సోయం శేఖర్, కురసం రాంబాబు, బండారి పుల్లారావు, సున్నం నవీన్, కొరస వెంకటేశ్వరరావు, కురం ప్రసాద్, వాగెల రాజు తదితరులను ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో ఆదివాసి సేన నాయకులు సోదెం సుమన్ బాబు, కురసం బాబూరావు, కోరీ రామకృష్ణ, కురసం రాజు, సీనియర్ నాయకులు తాటి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్....

Related Articles

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన జవహర్ నగర్ తొలి మేయర్: మేకల కావ్య.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.కీసర సర్కిల్ : జవహర్ నగర్: జవహర్...

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల...

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ ‌ అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ, మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం...
error: Content is protected !!