
. కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక కలసపాడు రిపోర్టర్
వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ జిల్లా కలెక్టర్. శ్రీధర్ చెరుకూరి…
చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులు సంప్రదాయబద్ధంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంటింటా వెలిగించే దీపాలు, దీపాల కాంతులు శుభానికి, ఆశకు ప్రతీకలని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంగా ఎదుర్కొని, పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధించాలనే గొప్ప సందేశాన్ని దీపావళి పండుగ అందిస్తుందని తెలిపారు.
జిల్లా ప్రజలందరూ తమ స్థోమతకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అయితే దీపావళి వేడుకల్లో నూనె దీపాలు, టపాసులు, నిప్పు వంటి వాటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, యువత అత్యుత్సాహానికి పోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పండుగ ఆనందం ప్రమాదాల కారణంగా విషాదంగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకుండా సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

