ePaper
Monday, November 9, 2026
📄 ePaper

శ్రీశైలంలో బయలువీరభద్రస్వామివారికి విశేష పూజలు

📰 Generate e-Paper Clip

అమావాస్య సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.. భక్తులకు పరోక్ష సేవ అవకాశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 09 2026: శ్రీశైలం అమావాస్య ఘడియలను పురస్కరించుకుని శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామివారికి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి ఈ విశేషార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్య సందర్భంగా భక్తులు సైతం పరోక్ష సేవ రూపంలో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహాగణపతి పూజ నిర్వహిస్తారు. అనంతరం పంచామృతాలతో పాటు బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీ బయలువీరభద్రస్వామివారి ఆరాధనతో గ్రహదోషాలు తొలగిపోతాయని, అరిష్టాలు నివారించబడతాయని, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నుంచి రక్షణ కలగడంతో పాటు సర్వకార్యానుకూలత, అభీష్టసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

Latest Articles

అశ్వరావుపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు  జూపల్లి రమేష్ బాబు...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజపొలిటికల్ పవర్...

Related Articles

శ్రీశైలంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా, శ్రీశైలం, నవంబర్ 09 2026: శ్రీశైలం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం...

సొంతూరు ‘చంద్రగిరి’లోనే ప్రజాదరణ సున్నా.. పులివెందుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి** 15 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని...

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన జగ్గయ్యపేట మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల్లో మండవ శ్రీనివాస్ ఘన విజయం సాధించారు....
error: Content is protected !!