ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

పార్కలగండికి చేయూత.. 25 నూతన పెన్షన్లు మంజూరు

📰 Generate e-Paper Clip

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ కొమరం సుశీల

పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 14: అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించి, ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత సామాజిక భద్రత పెన్షన్లు పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీకి మొత్తం 25 నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమరం సుశీల ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక భరోసాను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

నూతనంగా మంజూరైన 25 పెన్షన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.,

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ కొమరం సుశీల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక...

Related Articles

బాలల భవిష్యత్తుకు చదువే పునాది

నారాయణపురంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులతో మమేకమైన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపురం జెడ్పీ హైస్కూల్‌తో పాటు నారాయణపురం...

భవిష్యత్తు ప్రపంచ నిర్మాణంపై భారత్ సమ్మిట్‌లో చర్చలు

'ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున,నవంబర్ 14: హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో భాగంగా శనివారం...

ప్రాణాపాయ స్థితిలో తల్లీబిడ్డ.. వైద్యుల సమయస్ఫూర్తితో ఇద్దరికీ పునర్జన్మ!

క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయవంతంగా శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనికకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందనలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ ఇన్‌చార్జ్, మేడపురెడ్డి నాగార్జున:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి...
error: Content is protected !!