ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బుద్ధారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ యువతకు స్ఫూర్తి చిహ్నంగా నిలవాలి

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో మంగళవారం గ్రామ శివాజీ యూత్, గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… శివాజీ మహారాజు ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. అణగారిన వర్గాల రక్షణ కోసం శివాజీ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. శివాజీ తన పరిపాలనలోపు లౌకికవాదానికి పెద్దపీట వేశారని అన్నారు. శివాజీ తన రాజ్యంలో మహిళలకు ఎక్కువ గౌరవం ఇచ్చారని తెలిపారు. స్వదేశాభిమానం, పరిపాలనా నైపుణ్యం కలిగిన గొప్ప నాయకుడిగా శివాజీ నిలిచారని అన్నారు. యువత ఆయన జీవితం నుండి స్పూర్తి పొందాలని పిలుపునిచ్చారు. శివాజీ చూపిన మార్గంలో నడిస్తే సమ సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి మహానుభావుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయాని అన్నారు. శివాజీ విగ్ర ఆవిష్కరణకు కృషిచేసిన శివాజీ యూత్ ను, గ్రామ యువతను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ శివాజీ, మాజీ సర్పంచ్ అచ్చితరామారెడ్డి, వనపర్తి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, బుద్ధారం గ్రామ పెద్దలు, గ్రామ యువత, స్థానిక కాంగ్రెస్ నాయకులు, రామ్ జి నాయక్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!