ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మోడీ సభను విజయవంతం చేద్దాం – భారీ సంఖ్యలో తరలిరావాలి

బీజేపీ సీనియర్ నాయకులు డి. విటల్ రెడ్డి పిలుపు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు డి. విటల్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్ పారేడు గ్రౌండ్‌లో జరిగే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారులు, రైల్వేలు, జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ పథకం ద్వారా కోట్లాది రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మెడికల్ కళాశాలలు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా అనేక గ్రామాలకు పైప్‌లైన్ సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం ఉజ్వల పథకం, స్వయం సహాయక సంఘాలకు రుణ సౌకర్యాలు అందిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు ఉచిత గృహాలు, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ప్రజలు మోడీ నాయకత్వానికి మద్దతుగా సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని డి. విటల్ రెడ్డి కోరారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!