ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 14 2026: హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లో తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ (రజక) కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు, వనపర్తి యువ నాయకులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అజయ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రజక వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ మరింతగా కృషి చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీసీ వెర్టికల్ సీఏ స్టేట్ హెడ్ సుబ్బారావు, ఏఐపీసీ ఎంఎస్ఎంఈ స్టేట్ వెర్టికల్ హెడ్ పి. శశాంక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!