పొలిటికల్ పవర్, న్యూఢిల్లీ ఆగస్టు 19:
అమిత్ షా యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం న్యూఢిల్లీలోని సింధు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న కేంద్ర మాజీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అమిత్ షా యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో తెలంగాణలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా యూత్ బ్రిగేడ్ జాతీయ అధ్యక్షులు డా. శుక్లా మరియు పలువురు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు డా. మద్దిశెట్టి సామేలు తెలిపారు.
తెలంగాణలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అజయ్ కుమార్ మిశ్రా సానుకూలంగా స్పందించినట్లు డా. మద్దిశెట్టి సామేలు తెలిపారు.
అదేవిధంగా, తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని చిన్నదురై స్వామి ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధికి సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, హోం శాఖ ద్వారా లేఖ రాయాలని డా. మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం అజయ్ కుమార్ మిశ్రా కి వినతిపత్రం అందజేశారు.
ఈ విషయంపై కచ్చితంగా లేఖ రాస్తానని, హిందూ దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ పరంగా సాధ్యమైన సహకారం అందించి, న్యాయం జరిగేలా కృషి చేస్తానని అజయ్ కుమార్ మిశ్రా హామీ ఇచ్చారు.
ఈ భేటీలో తెలంగాణలో అమిత్ షా యూత్ బ్రిగేడ్ కార్యక్రమాల విస్తరణ, యువతను మరింతగా సంఘటితం చేయడం, రాబోయే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు.
