పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం
సీఎంఓ డైరెక్షన్లో టీడీపీ గూండాల ఆగడాలు
మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాల అడ్డగింత
ఆరురోజులుగా సాగని లైమ్‌స్టోన్ మైనింగ్
ముడిఖనిజం లేకపోవడంతో
2 యూనిట్లలో నిలిచిన ఉత్పత్తి
15వేల కుటుంబాలపై ప్రభావం..
గత 17సంవత్సరాలుగా
భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు..
ప్రత్యక్షంగా 3వేల మందికి,
పరోక్షంగా 12వేల మందికి ఉపాధి పొందుతున్న
పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్షబూనింది.
పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న
మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుని,
భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలన్నదే
సీఎంఓ లక్ష్యమన్నట్లు కనిపిస్తోందని
అధికారవర్గాలలోనూ చర్చ నడుస్తోంది.
తాము చేయగలిగింది ఏమీ లేదని,
పైనుంచి వస్తున్న వత్తిడి వల్లే ఏమీ
చేయలేకపోతున్నామని జిల్లా అధికారల్లో
చర్చ జరుగుతోంది.
భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు
నిలిచిపోవడం వల్ల 15వేల మంది కార్మికుల జీవితాలు,
వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది.

