ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటఅవినీతికి అడ్డాగా సీతారామ ప్రాజెక్ట్ పనులు*

అవినీతికి అడ్డాగా సీతారామ ప్రాజెక్ట్ పనులు*

📰 Generate e-Paper Clip

 

*పత్రికల్లో కథనాలు వచ్చిన స్పందించని అధికారులు*

*ములకలపల్లి చేరుకున్న భారీ ఇనుము ఎక్కడిది ఎవరిది ఎఈ నుండి సిఇ వరకు వాటాలు!*

*ప్రభుత్వ అధికారుల గుత్తేదారుల వాటా ఎంత?*

*ఇనుమును దొంగతనం చేసినవారిపై కేసు ఎందుకు పెట్టలేదు*

*నాణ్యత లేక కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం*

*ఫిర్యాదు లేకుండా పోలీసులు విచారణ చేసారా ?*

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్ ) జులై 11:* ములకలపల్లి మండలం కమలాపురం గ్రామపంచాయతీ శివారులో సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ టూ వద్ద జరుగుతున్న కాంక్రీట్ పనుల్లో అవినీతి పెరిగిపోయింది విచ్చలవిడిగా ప్రభుత్వ పనుల నాణ్యత కు తిలోదకాలిస్తూ గుత్తేదారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు బాహాటంగా గత రెండు రోజులు క్రితం ఓ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనంపై కనీస స్పందించని ఇరిగేషన్ అధికారులు ఏ ఫిర్యాదు అందలేదంటూ ములకలపల్లి మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రాంతంలో పోలీసుల సంచారం పలు అనుమానాలకు తావిస్తోంది తిరిగి మరుసటి రోజున పత్రికా కథనాల ప్రకారం ఇనుము చేరిందని తెలిపారు కానీ అసలు పనులకు వాడాల్సిన ఇనుము గ్రామాల్లోకి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ నాసిరకం పనులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం శోచనీయం ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోకపోతే కొంతమంది సామాజిక కార్యకర్తలు విషయం ఆ శాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వినికిడి ఏది ఏమైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టులు లో జరుగుతున్న అవినీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపై గుత్తే దారులపై చర్య తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!