“సర్” ప్రక్రియ వేగవంతం చేయాలని గ్రామ బీఎల్‌వో, బీఎల్ఎలకి సూచించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: పెద్దమందడి మండలంలోని బుగ్గపలి తండా, అమ్మపల్లి, అమ్మపల్లి తండాలను గ్రామాలలోని బూతులలో బిఎల్ఓ లకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అర్హుల ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలంలోని నాయకులతో కలసి “సర్”(ఓటర్ జాబితా సవరణ) జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సమయం లేనందున బి.ఎల్.ఏలు ప్రత్యక్షంగా ప్రజలను కలసి వారికి అవగాహన కల్పించి తుది డ్రాప్టింగ్ లో ఖచ్చితంగా ఓటు నమోదు చేయించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని బీఎల్వోలని అడిగి మండలములో జరుగుతున్న సర్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలుసుకున్నారు. కొన్ని బూతులలో బిఎల్ఓ లకు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల వారిపై తీవ్ర ఒత్తిడి ఉందని అవసరమైన సిబ్బందిని సమకూర్చి సకాలములో ఓటర్ జాబితా సవరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మనిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, మాజీ సింగిల్ విండో ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, చిన్న రఘు, సేనాపతి పురుషోత్తం రెడ్డి, అమ్మపల్లి రామేశ్వర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు బందేన్న , చందు బస్వరాజు రాకేష్ పాల్గొన్నారు


